పండుగలా గుంటూరు ఈస్ట్౼వెస్ట్ నియోజకవర్గాల్లో 3వ రోజు జనసేన సభ్యత్వ కిట్లు పంపిణీ..

గుంటూరు: జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు… జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆదేశాల ప్రకారం.. గుంటూరు ఈస్ట్౼ వెస్ట్ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యులకు మహిళా కో-ఆర్డినేటర్ శ్రీమతి పార్వతి నాయుడు, జిల్లా జెనరల్ సెక్రటరీస్ నారదాసు రామ చంద్ర ప్రసాద్, కొప్పుల కిరణ్ బాబు, నగర అధ్యక్షులు నెర్రెళ్ళ సురేష్ కిట్లను ప్రదానం చేశారు. వాలంటీర్లకు ప్రసంసా పత్రాలతో బాటు సత్కరించటం జరిగింది.. వాలంటర్ల చేతులు మీదుగా క్రియాశీలక సబ్యులకు కిట్లు ప్రదానం చేశారు.