సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతమే మా లక్ష్యం: తిరుపతి జనసేన

*జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వారిని సన్మానించి, ఇన్సూరెన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం..

తిరుపతి: ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో పాలక పార్టీ దోపిడిని ప్రశ్నిస్తూ.. నేటి అరాచక పాలనలో ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్న.. ఓటర్లు ఎప్పుడెప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా .. జనసేన పార్టీని గెలిపించుకొవాలనుకునే వారు పార్టీ సభ్యత్వం తీసుకుని తద్వారా ఇన్సూరెన్స్ పొంది.. జనసేన పార్టీకి మరింత బలాన్ని అందించడం పట్ల… జనసేన పార్టీ నేతలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి తదితరులు ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభ్యత్వ చేసిన కృష్ణయ్య, పగడాలు మురళి, బాబ్జి, హేమకుమార్, సుమన్ బాబు, కొండరాజు మోహన్, ఆనంద్, పార్ధు, వనజ, కీర్తన, కిషోర్ హేమంత్ తదితరులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి.. సభ్యత్వం నమోదు చేసుకున్న జనసేన పార్టీ సభ్యులకు.. ఇన్సూరెన్స్ కిట్లను అందిస్తూ.. వీరు మాట్లాడారు… రాష్ట్ర పాలకులపై సమరానికి తమ జనసేనాని సన్నద్ధమయ్యారని కొనియాడారు.. త్వరలో బస్సు యాత్రను మన తిరుపతి నుంచి మొదలుపెట్టి .. ఆరు నెలల పాటు రాష్ట్రం మొత్తం పర్యటించి, జనాల కష్టాలను తెలుసుకుని, అధ్యయనం చేసి.. ప్రజా సమస్యల సాధనకై పోరాటం చేస్తారని తెలిపారు.. నెక్స్ట్ 2024లో రానున్నది జనసేన పార్టీ నేనని ఆనాటినుండి రాష్ట్ర ప్రజలకు అన్ని మంచి రోజులే నన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పట్టణ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు.