మంచి నీటి సమస్యను పరిష్కరించండి: చిన్నటేకూరు జనసేన

పాణ్యం నియోజకవర్గం, కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీరు పైపులు లీకవ్వడం వలన నీరు కలుషితమై దుర్వాసన వస్తుండడంతో ప్రజలు నీటిని తాగలేక ఇబ్బందులు పడుతూ.. అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ సమస్యకు సంబంధించి పరిశుభ్రమైన నీటిని అందించాలంటు ఆ గ్రామ జనసైనికులు పంచాయతీ సెక్రెటరీకి వివరించడం జరిగింది. అలాగే ఆ నీటిని కూడా సెక్రెటరీకీ చూపించడం జరిగింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ సమస్య కై పంచాయతీ సెక్రెటరీ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వై బజార్, హుస్సేన్, సలాం, శివ, వకీల్ వీరంతా కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.