శ్రీకాంత్ తనయుడితో మరో ‘పెళ్లి సందడD’

శత చిత్ర దర్శకుడు, దర్శకేంద్రుడు కొత్త సినిమా పై అప్డేట్ ఇవ్వనున్నాడని అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ ప్రోమోతో ఒక క్లారిటీ ఇచ్చారు. 1996లో వచ్చిన పెళ్లి సందడి లాంటి సినిమా మళ్ళీ రాబోతోందని చెబుతూ టెక్నీషియన్స్ పేర్లను ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అని ఆ ప్రోమో మ్యూజిక్ వినగానే అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన ట్రయాంగిల్ లవ్ స్టొరీ పెళ్లిసందడి తక్కువ బడ్జెట్ లో అల్లు అరవింద్, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా అందులో ఉన్న అన్ని పాటలను జనాలు అమితంగా ఆస్వాదిస్తారు.

24 సంవత్సరాల అనంతరం తాజాగా పెళ్లి సందD తో మళ్ళీ సరికొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు దర్శకేంద్రుడు వివరణ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గాని శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ కెరీర్ మొదట్లోనే పెళ్లి సందడి సినిమాతో మంచి బూస్ట్ అందుకొని ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు రోషన్ కూడా అదే టైటిల్ తో రెగ్యులర్ హీరోగా బిజీ కావాలని అనుకుంటున్నాడు.

కొన్నేళ్ల క్రితం రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చదువు కారణంగా కొంత గ్యాప్ ఇచ్చిన రోషన్ ఇప్పుడు పెళ్లి సందడDతో రెగ్యులర్ నటుడిగా బిజీ కావాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో రోషన్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక తన మెయిన్ టెక్నీషియన్స్ గురించి చెప్పిన దర్శకేంద్రుడు త్వరలో నటీనటులపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నాడు.