ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 7వ రోజు పాదయాత్ర

ఏలూరు, స్థానిక 6వ డివిజన్ తూర్పు వీధిలోని గంగానమ్మ గుడి వద్ద నుండి రెడ్డి అప్పల నాయుడు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రతి గడపలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని.. ఇటీవల అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు సుమారు 3000 కుటుంబాలకు తన సొంత కష్టార్జితం నుండి 30 కోట్లు రూపాయలను ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందిస్తుంటే కనీసం ఆ కుటుంబాలకు ఇవ్వవలసిన నష్టపరిహారం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు దత్తపుత్రుడు అని విమర్శించడం సరైన విధానం కాదని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలు చేయడం వలన ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదని ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించి మంచి పరిపాలన అందించాలని రెడ్డి అప్పల నాయుడు డిమాండ్ చేశారు. మరోమారు పవన్ కళ్యాణ్ ని పదేపదే చంద్రబాబు దత్తపుత్రుడు అని అంటే మిమ్మల్ని సిబిఐ దత్తపుత్రుడు అని రాబోయే ఎన్నికల్లో పిలవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ గతంలోనే అనేక మార్లు నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడు అని మరి ఏ ఇతర రాజకీయ నాయకులకు దత్తపుత్రుడు కానని హెచ్చరించారు. అయినా కూడా మీ నాయకులకు బుధ్ధి లేకుండా మాట్లాడటం అది మీ ప్రభుత్వానికి ముప్పు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దోసపర్తి రాజు, బుద్ధా నాగేశ్వరరావు, ఇద్దుం చిరంజీవి, పొన్నూరి రాము, రాయి నూకరాజు, దోసపర్తి దుర్గారావు, సుంకర భాస్కర్ రావు, చిన్ని అన్నవరం, కోలా శివ, కోలా అప్పారావు, మళ్ళా మురళి, శివ, ముమ్మల శ్రీను, ముమ్మల రమేష్, మకరబోయిన పండు, వేగి పరదేశి నాయుడు, పంచాడ మల్లేష్ మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.