ద్వారపూడి-మండపేట రోడ్డు తక్షణమే నిర్మాణం చేయాలి: వేగుళ్ళ లీలాకృష్ణ

*నిర్మాణం చేయని పక్షంలో ఉద్యమం
*త్వరలో పూర్తి కార్యాచరణ ప్రణాళిక ప్రకటన

మండపేట: ద్వారపూడి-మండపేట ఆర్ అండ్ బీ రహదారి అభివృధ్ది పనులు వెంటనే చేపట్టాలని, అలా కాని పక్షంలో జనసేన పార్టీ తరుపున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో వారి స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగు మాసాలుగా జనసేన పార్టీ ఇప్పనపాడు సర్పంచ్ కుంచె వీరమణి, ప్రసాద్ లు నిత్యం పోరాటం చేస్తూ.. కలెక్టర్ కు ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా నేటికి టెండర్ పక్రియ పూర్తికాకపోవడం దారుణమని పేర్కొన్నారు. కేవలం వైసీపీ నాయకుల కమిషన్లకు భయపడి గుత్తేదారులు టెండర్ వేయుటం లేదని లీలాకృష్ణ ఆరోపించారు. ఎండ కాస్తే బూడిద, వర్షం కురిస్తే బురదగా ఆ రహదారి పరిస్థితి నెలకొంది అన్నారు. ఆ రోడ్డు రిపేర్ల పేరు చెప్పి 70 లక్షలు వెచ్చించి రాళ్లు పరచి అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ తోట ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే తప్ప మరొకటిలేదని పేర్కొన్నారు. ఇకనైనా మండపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు ముందుకు వచ్చి మండపేట నియోజకవర్గంలో పాడైపోయి.. ప్రజలు ఇబ్బంది పడుతున్న రహదారులను తక్షణమే యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ద్వారపూడి రోడ్డు నిర్మాణం చేయని పక్షంలో ఆందోళనలకు సిద్ధమని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలుపై జనసేన పార్టీ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తుందని లీలాకృష్ణ స్పష్టం చేశారు.