పారిశుద్ధ్య కార్మికుల రిలే నిరాహార దీక్షలకు జనసేన పూర్తి మద్దతు

గుంటూరు: వారంలో ఒకరోజు కూడా పూర్తిగా సెలవు లేకుండా పారిశుద్ధ్య పనిచేస్తు నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కొరవడింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని తమ ఎన్నికల హామీ ద్వారా ప్రచారం చేసి.. అధికారం చేజిక్కిన తర్వాత కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయకుండా తాము నియమించుకున్న వార్డు సెక్రటరీలను పర్మినెంట్ చేయడాన్ని నిరసిస్తూ.. జూన్ 21వ తేదీన గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేయుట కొరకు రాష్ట రెల్లి సంఘం నాయకులు సోమి ఉదయ్ కుమార్, జేఎస్పీ రాయల్ సోల్జర్స్ అన్నదాసు వెంకట సుబ్బారావు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వారంలో ఒకరోజు సెలవు ఇవ్వక పోవడం చాలా బాధాకరం.. పారిశుద్ధ్య కార్మికులు కూడా మనుషులే అని జగన్ రెడ్డి గారు ఎందుకు గుర్తించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు బకాయిపడిన 6 నెలల హెల్త్ అలవెన్సులు వెంటనే ఇవ్వాలని.. కరోనాలో నియమించిన కార్మికులకు బకాయిపడిన 6 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని.. పారిశుధ్య కార్మికులను.. వార్డు సచివాలయాలకు బదలాయించి మా కార్మికులను బానిసలుగా మార్చకండి అని ద్వజమెత్తారు. ప్రజారోగ్యాన్ని కాపాడే పారిశుధ్య కార్మికులకు శానిటరీ ఇన్స్పెక్టర్లు మాత్రమే మస్టర్ వెయ్యాలని.. నడి రోడ్లపై చీకట్లో వార్డు సెక్రటరీలు మస్టర్లు వేయడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ వార్డు సెక్రటరీల కంటే ముందు 19 ఏళ్ళుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.


జూన్ 21 నుండి పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మా జనసేన గుంటూరు జిల్లా & నగర నాయకులందరూ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని ప్రకటిస్తారని తెలియజేసారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తులకు ఇచ్చిన హామీలను మేము అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసారు.