యెనుగంటి హరిబాబు వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాకినీడి

పిఠాపురం నియోజవర్గం, పిఠాపురం మండలం, వెల్దుర్తి గ్రామంలో.. నిస్వార్థ జనసేన నాయకుడు.. పవన్ కళ్యాణ్ గారిని దైవంగా భావించే భక్తుడు.. జనసేన పార్టీ ఉప సర్పంచ్ యెనుగంటి హరిబాబు వివాహ మహోత్సవానికి మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు.. జనసేన నాయకులు జనసైనికులతో కలిసి పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి వివాహానికి హాజరై.. నవ వరుడిని ఆశీర్వదించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ నాయకులు గోపు సురేష్, మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి,పెనుగొండ సోమేశ్వరరావు పెనుగొండ వెంకటేశ్వరరావు, కంద సోమరాజు, పబ్బినీడి దుర్గాప్రసాద్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.