TTD ఈవోగా జవహర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన ముందుగా స్వామికి తలనీలాలు సమర్పించారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లారు. రంగనాయక మండపంలో టీటీడీ ఈవో(ఎ్‌ఫఏసీ) ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్య కార్యదర్శిగా జవహర్‌రెడ్డి చేత ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరిగి రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.

జవహర్ రెడ్డి టీటీడీకి 27వ అధికారి. జవహర్‌రెడ్డి ప్రస్తుతం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తాత్కలిక ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను ప్రభుత్వం ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది. అక్కడి ఉన్న జవహర్‌రెడ్డి టీటీడీకి బదిలీ అయ్యారు.