పునరావాసానికి ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితులకు న్యాయం జరగలేదు: దారం అనిత

హంద్రీనీవా కాలువ కు శ్రీనివాసపురం, తాడేపల్లి జలాశయాలతో పాటు గుంటి వారి పల్లె, మదనపల్లె మండలంలో నిర్మించిన కాలువ వల్ల నివాసాలు కోల్పోయిన నిర్వాసితులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గుంటి వారి పల్లె వారి పల్లె గ్రామాలకు చెందిన 33 మంది నిర్వాసితులు 2012 నుండి తమకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. వీరికి 4. 50 కోట్లతో అన్ని వసతులు కల్పించాల్సి ఉండగా.. ఇంత వరకు వీరికి ఎలాంటి సాయం అందలేదు. కల్పించలేదు దీనిని సాధించుకోవడానికి నిర్వాసితులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే అధికారులు మాత్రం వీరికి ఈ ప్యాకేజీ మంజూరు కాలేదని చెబుతుండగా.. మంజూరైనట్లు తమ వద్ద ఉన్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. వేసవి జలాశయం నిర్మాణంలో గుత్తి వారి పల్లి ముంపునకు గురవుతుందని.. ఇళ్లను ఖాళీ చేసి వెళ్తే ఆర్ అండ్ బి ప్యాకేజీ కింద అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తామని అధికారులు చెప్పారు. దీనికి సంబంధిం శీన పత్రం కూడా ఇచ్చారు. ఆర్ అండ్ బి ఆర్ ప్యాకేజీ కింద అమలు చేయాలని 2012 నుండి నిర్వాసితులు పోరాడుతున్నారు పలుసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చినా న్యాయం జరగలేదని నిర్వాసితులు వాపోతున్నారు. వెంటనే వీరికి న్యాయం జరగాలని జనసేన పార్టీ తరపున చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.