వైరల్ అయిన రకుల్ బర్త్ డే పార్టీ వీడియో

గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10 న వసంతంలోకి అడుగుపెట్టింది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అక్టోబర్ 10తో మూడు పదుల వయసును పూర్తి చేసుకుంది. 2009లో కన్నడ సినిమా ‘గిల్లి’ తో తెరంగేట్రమ్ చేసిన రకుల్ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుండటం విశేషం. రకుల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో తన అభిమానులు ఆమె బర్త్‌డేను ట్రెండ్‌ చేశారు.

రకుల్ పుట్టినరోజు సందర్భంగా రకుల్ కు టాలీవుడ్‌లో ఎంతో ఆప్తురాలు, మిత్రురాలు అయిన మంచు లక్ష్మీ ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. బహుశా ఈ వీడియో మంచు లక్ష్మీ బర్త్‌డే పార్టీలోనిది అయ్యిండొచ్చు. అయితే ఈ వీడియోలో రకుల్‌, మంచు లక్ష్మీని కౌగిలించుకోవడం చూస్తుంటే.. వారెంత గొప్ప స్నేహితులో అర్థమవుతుంది.

ఈ వీడియోలో రకుల్‌.. మంచు లక్ష్మిని ఆప్యాయంగా వెనకనుంచి హత్తుకున్నట్టు కనిపిస్తుంది. చుట్టు పక్కల కూడా చాలా మంది ఫ్రెండ్ ఉన్నట్టు వీడియో ద్వారా అర్ధమవుతుంది. మంచు లక్ష్మీ తన పోస్ట్‌లో రకుల్ .. నిజాయితీ గల హార్డ్ వర్కర్, ఫన్, కేరింగ్, మ్యాడ్ ఫ్రెండ్, హ్యాపీ బర్త్ డే మై లవ్. నువ్వు ఎవరి లైఫ్‌ని టచ్ చేసినా హ్యాపీగా ఉంటారు అని కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన రకుల్‌.. ‘లవ్యూ.. నువ్వు నా సోదరి. నా సోల్. నువ్వు నాతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. చీర్స్..’ అని పేర్కొంది.