‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి తాజా అప్‌డేట్

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. ఈ సినిమాకు సంబందించి అక్టోబర్ 22న ఎన్టీఆర్‌కి సంబంధించిన వీడియోను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణా సాయుధ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తున్నాడు. అక్టోబర్ 22న ఎన్టీఆర్‌కి సంబంధించిన వీడియోను విడుదల చేయనున్నారు.   వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి, భీమ్ చేతులు కలిపినట్లు ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.