పల్లిపేట గ్రామంలో ఇంటింటికి జనసేన విస్తృత ప్రచారం

*పవనన్న ప్రజాబాట 73వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో.. రణస్థలం మండలం, పల్లిపేట గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు.. ప్రజా సమస్యల పరిష్కార దిశగా.. పార్టీ బలోపేతం దిశగా.. ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు జె.ఆర్.పురం మండలం యంపిటిసి అభ్యర్థి దన్నాన చిరంజివి ఆధ్వర్యంలో.. గురువారం కృష్ణాపురం యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకరరావు జనసేన పార్టీ నాయకులు తిప్పాన చిన్న, జనసైనికుడు బెల్లాన నూకరాజు కార్యక్రమంలో భాగంగా.. రణస్థలం మండలంలోని పల్లి పేట గ్రామంలో పర్యటించి.. ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. జనసేన పార్టీ సిద్దాంతాలు మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది.. అలాగే పల్లిపేట గ్రామ చేరువలో ఉన్న ఉపాధి కూలీలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకోని.. పవన్ కళ్యాణ్ గారు పదవి ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఒక్కొక్క కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు జేస్తున్నారు. రాష్ట్రంలో 30కోట్లు రూపాయలు 3000మందికి కౌలు రైతులకు ఇవ్వడాని అయిన సిద్దాపడ్డారు.. ఇలాంటి మంచినాయకులును గెలుపించుకోవలసిన బాధ్యత మనపైన ఉంది. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మహిళలుకు సంవత్సరాని 6గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబడును. తెల్లరేషన్ కలిగిన వారికి ఇసుక ఉచితంగా ఇవ్వబడును. అలాగే రేషన్ బదులు ఎకౌంటు లో 2500 నుండి 3500/-వరకు నగదు జమ చేయబడును. 60 సంవత్సరాల దాటిన రైతులకు 5000వరకు పెన్షన్ ఇవ్వబడును.. కాబట్టి రెండు పార్టీల పరిపాలనా చూసారు కాని.. ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పల్లిపేట గ్రామ ప్రజలు, మహిళలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.