2024 ఎన్నికల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది

రాబోయే 2024 ఎన్నికలు 2019 ఎన్నికలకు పూర్తి భిన్నంగా జరుగుతాయి.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనసేన ఆవిర్భావ సభలో కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించడమే కాదు, ఆంద్రప్రదేశ్ రాజకీయాలు కూడా జనసేన చుట్టూనే తిరుగుతూ వస్తున్నాయి.

అధికార వైసీపీ పార్టీని ఓడించడమే లక్ధ్యమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని, ఆ తర్వాత ఇంకాస్త స్పష్టంగా పొత్తులు లేవని చెప్పడంతో అన్ని పార్టీల్లోనూ కలకలం సృష్టించడమే కాదు అంతర్మథనంలో పడ్డాయి.

కారణం.. మిగతా ఏ పార్టీకి లేని పాజిటీవ్ ఓట్ ఇప్పుడు జనసేన వైపే చూస్తోంది.. గత ఎన్నికల్లో జరిగిన పొరపాటుని సరిదిద్దుకునే ఆలోచలనో ప్రజలు ఉన్నారు.. వారికి పవన్ కళ్యాణ్ ఒక్కడే స్వచ్ఛమైన నాయకుడిగా కనబడుతున్నారు.. టీడీపీ చంద్రబాబు కూడా ఒకమెట్టు దిగి ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించడం వారి డొల్లతనాన్ని, ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేదని చెప్పకనే చెప్పారు

ఒకటి మాత్రం స్పష్టం.. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు..