మున్సిపల్ కార్పొరేషన్ మైనారిటీ సెల్ కోఆర్డినేటర్ గా షేక్ సుభాని

మంగళగిరి, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీలో చేరిన షేక్ సుభాని ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మైనారిటీ సెల్ కోఆర్డినేటర్ గా నియమించి వారికి నియామక పత్రం చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటిఎంసి కోఆర్డినేటర్ మునగపాటి మారుతీరావు, రాష్ట్ర చేనేత వికాస్ విభాగం కార్యదర్శి జె.ఎస్.ఆర్ జంజనం సాంబశివరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు షేక్ కేరల, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు(ఎస్.ఎన్.ఆర్), పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.