ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యుడు గంధం ఆనంద్ ప్రతి ఒక్క విద్యార్థికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనసేన విద్యార్థి విభాగం మీకు తోడుగా మీ తరఫున హక్కుల కోసం మరియు విద్యార్థి సమస్యల కోసం పోరాడుతుందని తెలియజేస్తున్నాను. జనసేన విద్యార్థి విభాగంతో పని చేయండి సమాజ హితం కోసం మరింత బలంగా కలిసి పోరాడుదాం. అంతేకాకుండా ముందు ముందు చదువుల్లో మంచిగా చదువుకొని మీ లక్ష్యాలను చేరుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలుగా ఎదగాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరుపున తెలియజేస్తున్నాను. మీ లక్ష్యాలను చేరుకునే విధంగా కష్టపడి చదవాలి అప్పుడు మీరు అనుకున్న స్థాయిలో ఉంటారని తెలియజేస్తున్నానని తెలిపారు.