మహిళ చేసిన ట్వీట్ పై మంచు మనోజ్ రియాక్షన్

ఈ మధ్యకాలంలో మహిళలు సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు గురవుతుండటం ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా తనపై ఓ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ట్వీట్ చేసింది ఓ మహిళ. తనపై ఓ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ట్వీట్ చేసింది ఆ మహిళ. ఈ ట్వీటీకి మంచు మనోజ్ వెంటనే స్పందించడంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది.

తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని పేర్కొంటూ హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ రాష్ట్ర డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా తన గోడు వెల్లడించింది. ఓ ప్రముఖ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తనను లైంగికంగా, మెంటల్‌గా టార్చర్ పెడుతున్నారంటూ ట్వీట్ పెట్టింది.

నా ఫోన్ లో జరిగే ప్రతి యాక్టీవిటీని తెలుసుకుని నన్ను మానసికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఒక వ్యక్తి ప్రైవేట్ సమాచారం తెలుసుకోవడం ఎలా సాధ్యమో నాకు తెలియదు.. ఇంతకముందు దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నాకు న్యాయం జరగలేదు అని పేర్కొంది. ఇది చూసిన మంచు మనోజ్ ఆమహిళకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

”హాయ్ అమ్మా.. నీకు ఈ పరిస్థితులు ఎదురుకావడం చాలా బాధగా అనిపిస్తోంది. ఆ వ్యక్తుల వివరాలు ఫోన్ నెంబర్స్ నా ఇన్ బాక్స్ కి మెసేజ్ పెట్టండి” అని మనోజ్ ట్వీట్ చేశాడు. దీంతో మహిళకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మంచు మనోజ్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ సదరు మహిళ గతంలో చేసిన ట్వీట్స్ ని స్క్రీన్ షాట్ తీసి మనోజ్ కి రిప్లై పెడుతున్నారు. ఒకప్పుడు ఆమె చేసిన ట్వీట్స్ చూడండి.. ఇలాంటి వాళ్లకు సాయం చేయకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ మహిళ చేసిన ఆరోపణలపై సదరు టీవీ ఛానెల్ యాజమాన్యం స్పందిస్తుందేమో చూడాలి.