అన్నపూర్ణమ్మ లాంటి అవ్వకు జనసేన అండగా ఉంటుంది: విక్రమ్

ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలోని అన్నపూర్ణమ్మ అనే ఒక అవ్వకు 72 ఏళ్ల నిండినా పెన్షన్ అందడం లేదు. అవ్వ 50 సంవత్సరాలనుండి నుంచి జీవన ఉపాధి చేనేత వస్త్రాలు నెయ్యడం.. ఇప్పుటికీ అవ్వ ఉపాధి మీద కుటుంబ సభ్యులు ఆధార పడి బ్రతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అంపిలి. విక్రమ్ ఇంటికి వెళ్లి అవ్వని పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం చేసి.. కొద్దీ రోజుల్లో అవ్వకి పెన్షన్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం అని పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది.