వీ.టి.పి.ఎస్ కాలుష్య సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకువెళ్లిన పోలిశెట్టి తేజ

జనసేన పార్టీ ఏర్పరిచిన జనవాణి కార్యక్రమంలో.. ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరియు తుమ్మలపాలెం గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ. వి.టి.పి.స్ కాలుష్య సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
వి.టి. పి.స్ నుంచి వెలువడే బూడిద వలన ఇబ్రహీంపట్నం మండల మరియు కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు శ్వాసకోశా సంబంధిత మరియు చర్మ వ్యాధులకు గురవుతున్నారని వి.టి.పి.స్ నుంచి వెలువడే బూడిద నీరు పంట కాలువలోకి చేరడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే స్టేజ్ వన్ ప్లాంట్ ను మూసివేయాలని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. అలాగే తుమ్మలపాలెం గ్రామంలో శిధిలావస్థకు చేరుకున్న కెనాల్ వంతెనలు వి.టి.పి.స్ వారు నిర్మించాలని మరియు తమ గ్రామంలో ఉన్న హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని క్రైస్తవ స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలని నూతన మంచినీటి వాటర్ ట్యాంక్ తమ గ్రామంలో నిర్మించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ జనవాణి కార్యక్రమం ద్వారా వినతి పత్రం పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం జరిగింది.