సేవ చేసే భాగ్యం ఒక్క జనసేనకే సొంతం: బండారు శ్రీనివాస్

*సేవ చేసే భాగ్యం ఒక్క జనసేనకే సొంతం! బండారు శ్రీనివాస్ నాయకత్వంలో సేవలు, అండదండలు ఈ నియోజకవర్గ ప్రజలకు నిండుగా కావాలి! ప్రజలు అంటున్న మాట!

*ఆపదలోంచి త్వరగా గట్టెక్కాలని చిన్నారికి దీవెనలు అందించిన బండారు శ్రీనివాస్

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, కొత్తపేట గ్రామానికి చెందిన గాది రామారావు వారి చిన్నారి గత కొన్ని రోజులుగా ఫ్రీ మెచ్యూర్ పిటర్స్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ చిన్నారి కి ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని, ఆ చిన్నారిని కి దీవెనలు అందజేస్తూ.. కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ రథసారథి ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఆదివారం ఆ చిన్నారి కుటుంబ సభ్యులను కలిసి.. ఎంతో ఆత్మీయతతో ఆ చంటి బిడ్డకు దీవెనలు దీవిస్తూ.. తొందరగా ఆరోగ్యం కుదురుపడుతుందని, కంగారు పడకుండా ధైర్యంగా ఉండాలని ఆ చిన్నారి కుటుంబానికి భరోసానిస్తూ.. మేము ఎప్పుడు మీకు అండదండలు అందిస్తామని.. బండారు శ్రీనివాస్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిపి తమ వంతు కొంత సహాయంగా పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగినది. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆ చిన్నారికి దీవెనలు అందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.