దుబ్బాక ఉప ఎన్నికలకు సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ బుధవారం దాఖలు చేశారు. సోలిపేట సుజాత దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కేటాయించడం తెలిసిందే. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్‌తో కలిసి బుధవారం రిటర్నింగ్ అధికారికి సోలిపేట సుజాత తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

జర్నలిస్టుగా దాదాపు 25 ఏళ్లపాటు సోలిపేట రామలింగారెడ్డి పలు సంస్థలలో సేవలు అందించారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి సైతం పలుమార్లు దుబ్బాక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది విశేష సేవలు అందించారు. అయితే అనారోగ్యం కారణంగా కొన్ని నెలల కిందట ఆయన కన్నుమూశారు. దాంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి.

గత శుక్రవారం నుంచి దుబ్బాక ఎమ్మెల్యే ఉప ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16న నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా, 17న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 తుది గడువు. నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు.