బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ప్రెస్ మీట్

బొబ్బిలి పూల్ బాగ్ లో ఉన్న రోడ్డు దుస్థితిపై జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు గారి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం ఉందని తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రోడ్డు మరమ్మత్తుల పనులను ప్రారంభించారు. బొబ్బిలి నియోజకవర్గంలో చాలా వరకు రోడ్లు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయని, ఆ రోడ్లన్ని మరమ్మత్తులు చేపట్టి తక్షణమే పునరుద్ధరించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేసారు. సిఎం జగన్ రెడ్డి ఛాలెంజ్ చేసినట్టు జూలై 15 లోపు రాష్ట్రంలో రోడ్లన్నీ పునరుద్ధరీకరించి వారి సవాల్ ని నిలబెట్టుకోవాలని, తూ తూ మంత్రంగా రోడ్ల మరమ్మత్తులు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే జనసేన పార్టీ ఊరుకునేది లేదని చెప్పారు. ఒక వైపు రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాత్రికి రాత్రే మళ్లీ బస్ ఛార్జీలు పెంచడానికి ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదా అని అన్నారు. బస్ లు కండీషన్ దారుణంగా ఉన్నాయి, బస్ స్టేషన్ లలో కనీస సౌకర్యాలు, మెయింటినెన్నస్ లేకుండా బస్ చార్జీలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ముఖ్యమంత్రి మాట ప్రకారం జూలై 15 లోపు రోడ్లు పునరుద్ధరీకరణ పూర్తి చెయ్యకపోతే గుంతలు గోతులతో ఉన్న రోడ్లకు ఫోటోలు తీసి నేరుగా జగన్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో డిజిటల్ క్యాంపెయినింగ్ పెద్ద ఎత్తున చేసి మీ అసమర్థ పాలనను సోషల్ మీడియా వేదికగా మన దేశ ప్రజల ముందు నిలదీస్తామని కార్యక్రమంలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరడ అప్పలస్వామి, బాబు పాలూరుతో పాటుగా జనసేన నాయకులు సంచాన గంగాధర్, అడబాల నాగు, పల్లెం రాజా, వెంకటరమణ, పైల హరి, మరడాన రవి, జన, సత్య, చీమల సతీష్ మరియు జనసైనికులందరూ పాల్గొన్నారు.