బండారు శ్రీనివాస్ నాయకత్వంలో జనసేనలో చేరిన తలాటం నాగేశ్వరరావు

*కౌలు రైతుల కుటుంబాలకు కొండంత అండగా నిలబడిన జనసేనాని!
*బండారు శ్రీనివాస్ నాయకత్వము వర్ధిల్లాలి!
*తలాటం నాగేశ్వరరావు రిటైర్డ్ ఎస్ బి ఐ ఎంప్లాయి చేరిక!

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, కొత్తపేట గ్రామం నుంచి కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ రథసారథి, ఇన్చార్జ్ ప్రముఖ జనసేన నేత బండారు శ్రీనివాస్ నాయకత్వంలో సోమవారం రాత్రి జనసేన పార్టీలోకి చేరిన రిటైర్డ్ ఎంప్లాయ్ (ఎస్ బి ఐ బ్యాంక్) తలాటం నాగేశ్వరరావు సీనియర్ సిటిజన్, స్వచ్ఛందంగా జనసేన పార్టీ సభ్యత్వమును బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా తీసుకున్నారు. అనంతరం జనసేన జెండాను తన భుజస్కందాలపై వేయించుకుని, జనసేనాని రుణం తీర్చుకుంటానని.. ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ.. చనిపోయిన కౌలు రైతు కుటుంబం పట్ల, పలు ప్రజా సమస్యలపై జనసేనాని నిరంతరం పోరాటపటీముతో ముందుకు వెళుతూ ఉన్నారని.. జనసేనాని గొప్ప హృదయానికి, నేను సైతం అంటూ జనసేన పార్టీకి.. జనసేనానికి సేవ చేయడానికి నా వంతు శక్తి కి మించిన విధంగా పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమము వక్క పట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో.. కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో.. సీనియర్ నాయకులు చింతపల్లి సత్తిపండు కొత్తపేట మండల జనసేన ఉపాధ్యక్షులు ప్రముఖ సీనియర్ నాయకులు మహాదశ బాబులు, తులా రాజు, సత్తిబాబు, గంగరాజు పలువురు జనసైనికులు, కార్యకర్తలు మధ్య బండారు శ్రీనివాస్ వారి నివాస గృహం వాడపాలెం నందు జరిగినది.