గుంతకల్లు జనసేన కార్యకర్తకు ఆర్ధిక సహాయం

అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణానికి 13వ వార్డులో నివాసం ఉంటూ జనసేన పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి అకాలమరణం చెందిన జనసైనికుడు “కీర్తిశేషులు కావలి రవికుమార్” కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరికేరి జీవన్ కుమార్, జనసేన పార్టీ నాయకులు బోయ విరేశ్ కుమార్ మరియు 31వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి తాడిపత్రి విజయ్ కుమార్ వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపి వారి కుటుంబానికి సంవత్సరం పాటు ప్రతి నెల 3000 అనగా సంవత్సరానికి 36000 ఆర్థిక సాయం అందిస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, జనసేనపార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరికేరి జీవన్ కుమార్, మండల అధ్యక్షులు పురుషోత్తం, 13వ వార్డు అభ్యర్థి శేకర్, 31వ వార్డు అభ్యర్థి విజయ్, కార్యనిర్వహణ కమిటి సభ్యులు కృష్ణ, శేఖర్, జనసేన పార్టీ నాయకులు సుబయ్యి, విరేశ్, రఘు, పండు, ధాదు, అమర్నాథ్, మహేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.