డా. బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన గంధం ఆనంద్

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త.. స్వాతంత్ర్య సమరయోధులు భారత్ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు అని తెలియజేసారు.