రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను నరికి శ్రమదానం చేసిన కట్కూరు గ్రామ జనసైనికులు

పోలవరం, వేలేరుపాడు నుండి కోయిదా వరకు బస్సులు, ఆటోలు బైకుల మీద వెళ్ళాలంటే ఒక ప్రక్క రోడ్లు గుంతల మయం, మరో వైపు రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెరిగి పోయి రోడ్డు మీదకి కొమ్మలు వాలిపోయి ప్రయాణానికి ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు రాత్రిపూట ఆవులు గేదెలు రోడ్డు మీద పడుకొని ఉండటం వలన వాహన దారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సు డ్రైవర్లు బస్సుకు కొమ్మలు తగలడం వలన కొయిదా రావాలంటేనే భయపడుతున్నారు. అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. రోడ్డు మరమ్మత్తులకు నోచుకోక పోగా కనీసం రెండు వైపులా ఉన్న చెట్లను కూడా తొలగించడం లేదు. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్దం కాక విసుగెత్తిపోయారు. ఏ అధికారం లేని జనసేన పార్టీ కార్యకర్తలు నడుం కట్టుకొని శ్రమదానం చేసి చెట్లను తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేశారు. శ్రమదానం చేసిన వారిలో కట్కూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు పొడుతుల విజయ్, మాడి లక్ష్మణ్, కొత్త శివ, కొత్త రవి, వేట్ల సూరి, ముర్ల గణేశ్ కలసి రోజంతా శ్రమదానం చేశారు. ఏ అధికారంలేని జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్న పనిని చూసి పలువురు అభినందిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని జనసేన పార్టీ తరపున వైసిపి ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిదులను, అధికారులను డిమాండ్ చేస్తున్నాము. శ్రమదానం చేసిన జనసేన కార్యకర్తలను అభినందిస్తున్నాము. అభినందించిన వారిలో జనసేన పార్టీ అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి సంజయ్, క్రాంతి కుమార్, నరసింహారావు, ముత్యాలరావు, సుధాకర్ తదితరుల పాల్గొన్నారు.