వడ్డీఇండ్ల వాసుల సమస్యలను పరిష్కరించండి: డా.యుగంధర్

*డ్రైనేజి సమస్యనుండి వడ్డీఇండ్ల వాసులకు విముక్తి కల్పిస్తారా..?
*ఆక్రమణకు గురైన స్మశాన వాటికను సర్వే చేసి మార్గం సుగమం చేస్తారా..?
*అసలు గ్రామంలో గ్రామ కంఠం ఎంత ఉంది?
*ప్రభుత్వ స్థలాన్ని కాపాడలేరా?
*అసలే ఆళ్ల మడుగు అందులో అనేక సమస్యలు
*ఇప్పటికైనా స్పందించి సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం చూపుతారా?

వెదురుకుప్పం మండలం, ఆళ్ల మడుగు పంచాయతీ, వడ్డీ ఇండ్ల గ్రామం సమస్యల వలయంలో ఉన్నదని జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి డా. యుగంధర్ పొన్న ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజి సమస్యనుండి వడ్డీ ఇండ్ల వాసులకు విముక్తి కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన స్మశాన వాటికను సర్వే చేసి మార్గం సుగమం చేస్తారా లేదా అని రెవిన్యూ అధికారులకు తెలియజేసారు. అసలు గ్రామంలో గ్రామ కంఠం ఎంత ఉంది? అని లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడలేరా? అని దుయ్య బట్టారు. అసలే ఆళ్ల మడుగు అందులో అనేక అవస్థలు అని, దానిని చక్క దిద్దాల్సిన ఆవశ్యకత ఉందని, గ్రామాల్లో ప్రశాంత మైన వాతావరణం ప్రస్తుతం లేదని.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి మనుష్యుల మధ్య అంతరాయం, గ్రామాల మధ్య మనస్పర్థలు, కుటుంబాల మధ్య అంతరాలు ఏర్పడి సస్య శ్యామలంగా ఏర్పాటు కావాల్సిన గ్రామాలు అభివృద్ధికి నోచుకోక అవస్థలుపడుతున్నారని ఆవేదన చెందారు. గ్రామంలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమిని సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించి సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం చూపుతారా? లేదా అని రెవిన్యూ అధికారాలను కోరారు. స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు నలిపి రెడ్డి మధు, ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, గ్రామస్తులు ఉన్నారు.