అంబేద్కర్ ను అవమానిస్తున్న తీరును తప్పుపడితే.. అక్రమ కేసులతో దళిత యువకులను జైలు పాలు చేస్తారా!: బండారు శ్రీనివాస్

*దళిత యువకుల కుటుంబాలకు అండగా నిలిచిన కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, గోపాలపురం సెంటర్లో గత రెండు రోజుల క్రితం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నందు అంబేద్కర్ చిత్రపటాన్ని పేపర్ ప్లేట్లపై ముద్రించి, వాటిని వాడుతుంటే చూస్తూ ఉండలేక.. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహా నేతను ఇలా అవమాన పరుస్తున్న విధానాన్ని తప్పు బట్టి ప్రశ్నించిన యువకులపై అక్రమ కేసులు పెట్టి ఉన్నారని.. ఆ యువకులు రావులపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా కూడా.. వారి కంప్లైంట్లు తీసుకోకుండా.. అంబేద్కర్ చిత్రాన్ని పేపర్ ప్లేట్లపై ముద్రించి అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోమని దళిత యువకులు వెళ్లి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇచ్చినా.. వారిపై చర్యలు తీసుకోకుండా, చిత్రపటానికి అవమానం జరుగుతూ ఉంటే న్యాయం చేయమని కోరిన వారిపై అక్రమ కేసుల్లో బంధించి జైలు పాలు చేయడం మంచి పద్ధతి కాదని.. రాజ్యాంగంలోని విలువలను తుంగలో తొక్కినట్లు అని ప్రశ్నిస్తే ఇదే మీ దారుణమని, తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న దళిత యువకుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన బండారు శ్రీనివాసును వారి కుటుంబ సభ్యులు, ఎంతో ఆవేదంతో కలత చెందినారని, ఇలాంటి తప్పుడు కేసులతో దుర్మార్గాలు చేయడం మంచి పద్ధతి కాదని జనసేన నేత బండారు శ్రీనివాస్ తెలియజేశారు.