ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలపై మరింత భారం మోపడం వైసీపీకి తగదు: రాటాల రామయ్య

ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలపై మరింత భారం మోపడం వైసీపీ ప్రభుత్వానికి తగదని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య డిమాండ్ చేశారు. డీజిల్ సెస్ పేరుతో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుదలను తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పదే పదే పన్నుల భారాలను చార్జీల పెంపుతో దిగుబడులు మోపుతోందని ఇటీవల డీజల్ ధరల పెంపుకు సాకుగా చూపి దాదాపు రూ.720 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం మరోసారి డీజల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీలను మరలా పెంచడం చాలా దారుణమన్నారు. పల్లెవెలుగు బస్సుల్లో 30 -60 కిలోమీటర్లకు రూ.5లు ఎక్స్ప్రెస్ మెట్రో బస్సుల్లో 66-80 కిలోమీటర్లకు మరో రూ.10లు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఒక్కొక్క టిక్కెట్టుకు రూ.10లు చొప్పున ధరలు పెంచారని.. ఆఖరికి స్కూల్ పిల్లల బస్సు పాసులు ధరలు కూడా పెంచారన్నారు. అడుగడుగునా వైసీపీ ప్రభుత్వం తిరోగమన విధానాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. రెండుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపడం దుర్మార్గం అన్నారు.