శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి విరాళమిచ్చిన అర్జిల్లి అప్పలరాజు

పరవాడ మండలం నాయుడుపాలెం, ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయతీల పరిధిలో సమ్మంగిపాలెం జలారిపేట, హనుమాన్ నగర్, మంగప్పయ్యగారి ఊరు, కోరంగిపాలెం వద్ద నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ముత్యాలమ్మ పాలెం జనసేనపార్టీ నాయకులు అర్జిల్లి అప్పలరాజు తన వంతుగా 5116/_ ఐదు వేల నూట పదహారు రూపాయలు విరాళం అందజేశారు. వారికి కమిటీ సభ్యులు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కణితి చినసోమేష్, సమ్మంగి అప్పారావు, నాని, సమ్మంగి లోవరాజు మరియు బొంది ముత్యాలు, బొంది దుర్గారావు, చింతకాయల ముత్యాలు జనసేన నాయకులు పాల్గొన్నారు తదుపరి సభ్యులు పాల్గొన్నారు.