గూడు చెదిరిన అవ్వకు జనసైనికులు చేదోడు

రాజోలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండల పరిధిలో గల చింతలపల్లి గ్రామంలో పూరి గుడిసె కూలిపోయి నిస్సహాయంగా ఎదురు చూస్తున్న వేమన సరస్వతి ఇంటి పై కప్పును గణసాల రామరాజు ఆర్థిక సహాయంతో బరకంతో కప్పి ఆ అవ్వకు అండగా నిలిచారు. రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు ఆధ్వర్యంలో తాత్కాలిక ఆవాశం ఏర్పాటు చేసిన చింతలపల్లి గ్రామ జనసైనికులు గణసాల బాలాజీ, కోళ్ల సత్తిబాబు, పిప్పల లక్ష్మణరావు, బల్ల శ్రీను, ఇంటిపల్లి నాని, గణసాల పెద్దిరాజు, గణసాల రాజారావు మరియు జన సైనికులను పలువురు అభినందించారు. ఆపన్నులను ఆదుకోవటమే జనసేన పార్టీ ధ్యేయమని వైస్ ఎంపీపీ ఆనందరాజు జనసైనికుల సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు.