పుట్టపర్తి మున్సిపల్ కార్మికులకు జనసేన మద్దతు

సత్యసాయి జిల్లా, ఆధ్యాత్మిక కేంద్రమైన సత్యసాయి జిల్లా – పుట్టపర్తి నగర మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులకు ఈ ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు 21 వేలుగా జీతభత్యాలు పెంచేసామంటూ ఆర్భాటం చేసిన ఈ ప్రభుత్వం రాను రాను రాజు గుర్రం అదేదో అయినట్టు, జీతాలు తగ్గించి తగ్గించి 13 వేలకు కుదించారు. ఆ జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా కార్మికులతో నెలలకొద్దీ చాకలి చేయించుకోవడం అమానుషం. అదేవిధంగా 6 మంది ఉద్యోగులను ఆన్లైన్లో ఎక్కించకుండా రెండున్నర సంవత్సరం పాటు వారితో చాకరీ చేయించుకుని ఒక్క రూపాయి కూడా జీతాలు ఇవ్వకపోవడం నిజంగా దుర్మార్గం. పారిశుద్ధ కార్మికులు చేపడుతున్న సమ్మెకు 16 మంది పుట్టపర్తి కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించాల్సింది పోయి మీకు టీలకు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలకు స్నాక్స్ కు (కావాలంటే అన్నగారి #గ్యాలక్సీ #ప్రెసిడెంట్మెడలు #బూమ్బూమ్ లకు కూడా…) డబ్బులు ఇస్తాము కానీ ఇతర పార్టీ వాళ్ళు ఎవరూ రాకూడదు మీ సమ్మెకు మద్దతుగా అనడం మీ దుర్మార్గ పాలనకు నిదర్శనం. మరియు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మరియు మున్సిపాలిటీ కమిషనర్ మరియు కౌన్సిలర్లు కనీసం జీతాలు ఇవ్వలేని నిస్సహాయ స్థితికి చెర్రీ వారి చేతగాని వైనాన్ని ప్రజల దృష్టిలో తేటతెల్లం చేసుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫునుంచి సత్య సాయి జిల్లా కేంద్రంలో మునిసిపాలిటీ పారిశుద్ధ కార్మికుల డిమాండ్లను తక్షణమే ఈ ప్రభుత్వం నెరవేర్చాలని, పెండింగ్లో ఉన్న ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ నగదు చెల్లింపులు మరియు 6 మంది ఉద్యోగుల రెండున్నర సంవత్సరం జీతాలను తక్షణమే విడుదల చేసి వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ అల్లాడి జయరామ్, మేకల ఈశ్వర్ మరియు నాయకులు వెంకటేష్ నాయక్, సళ్ళప్ప ఆర్కేసి మారుతి, గందోడిసతీష్, శేషు, కొత్తచెరువు పవన్, మరియు సిఐటీయు జిల్లా నాయకులు మరియు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.