అధిక ఫీజులపై ధ్వజమెత్తిన కామిశెట్టి రమేష్

పిడుగురాళ్ల పట్టణంలో బడి పేరుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వ్యాపారం చేస్తున్నారని, బుక్స్ యూనిఫామ్ పేరుతో బిజినెస్ చేస్తున్నారని, అనేక రకాల స్కూల్ పేర్లతో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసి, ఈ రాక్షస క్రీడలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఆనందం పొందుతున్నాయని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ధ్వజమెత్తారు, ప్రభుత్వ నియమ నిబంధనలు అన్నీ కూడా తుంగలో తొక్కేసి ప్రజలను అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నారని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, తద్వారా స్కూల్ యాజమాన్యం లక్షలకు లక్షలు దండుకుంటున్నాయని తెలియజేశారు. 35 నుంచి 40 మంది సిట్టింగ్ ఉన్నటువంటి స్కూల్ బస్సుల్లో.. 70 మంది వరకు పిల్లలని బలవంతంగా కుక్కుతున్నారని వాపోయారు, అసలే ఒకపక్క కరోనాతో అష్ట కష్టాలు పడుతూ మధ్యతరగతి ప్రజలు జీవనం గడపలేక ఇబ్బందులు పడుతుంటే అధిక ఫీజులతో.. అప్పుల పాలవుతున్నారని తెలియజేశారు. వెంటనే విద్యాశాఖ అధికారులు వీటి మీద తమ చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకొని, వారు కట్టిన ఫీజులు మళ్లీ తిరిగి వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పిడుగురాళ్ల మండలం జనసేన పార్టీ తరఫున విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం చేస్తామని తెలియజేశారు.