ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన శివారెడ్డి

*రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సహయక చర్యలు కొనసాగించాలి అని కోరిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి అనేక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, కొన్ని చోట్ల ప్రాణ నష్టం వాటిల్లిందని తెలుస్తుంది మరో రెండు, మూడు రోజులపాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని, ఆస్తి నష్టం వాటిల్లిన కుటుంబాలను ఆదుకోవాలి అని కొరకు అలాగే, ప్రజలు పాత పడిన ఇంటిలో పాత గోడల వద్ద ఉండకుదడు అని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి అని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదు అని విజ్ఞప్తి చేసారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో భారీగా వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం నాయకులు సహాయక చర్యలలో వివిధ శాఖల అధికారులకు ప్రజలకు సహకరించాలి అని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అని సూచించారు.