స్మశాన వాటిక జిరాయితీ భూమి ఎలా అయ్యింది? ఎన్ని రాజు

  • స్మశాన వాటికను పరిశీలించిన జనసేన నాయకులు

రాజాం నియోజకవర్గం, బుచ్చింపేట గ్రామంలో స్మశానవాటిక స్థలాన్ని కబ్జా చేయుటకు భూ రికార్డులు మార్చిన విఆర్ఓ ఆనందరావు. స్మశాన వాటిక జిరాయితీ భూమి ఎలా అయ్యింది. విఆర్ఓ రికార్డ్ మార్చారు. ప్రజల పోరాటానికి పూర్తి మద్దతు. విఆర్ఓ ను సస్పెండ్ కాదు. డిస్మిస్ చేయాలని నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని రాజు డిమాండ్ చేయడం జరిగింది. స్మశాన వాటిక జిరాయితి భూమి ఎలా అయ్యిందో చెప్పాలని అధికారులు ను నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని రాజు ప్రశ్నించారు. గ్రామంలోని స్మశాన వాటికను గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్మశాన వాటిక విషయం గ్రామానికి వచ్చిన జనసేన నాయకులకు చెప్పారు. తాతలు తండ్రులు నుండి ఇదే స్మశాన వాటిక అని, రేట్లు పెరిగాయని అమ్మకం పెట్టారని చెప్పారు. గ్రామస్తులు చెప్పిన వివరాలు పై జనసేన నాయకులు రాజు స్పందిస్తూ ఈ విషయంలో అండగా ఉంటానని చెప్పారు. తదుపరి మాట్లాడుతూ ఈ స్థలం ప్రభుత్వ స్థలం అన్నారు. ప్రభుత్వ స్థలం కాబట్టే గత ప్రభుత్వం స్మశాన వాటిక నిర్మాణం కు నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉందన్నారు. స్థలం చుట్టూ ప్రహరీ గోడ కూడ నిర్మాణం అయిందన్నారు. ఈ స్థలం జిరాయితీ అయితే స్మశాన వాటిక నిర్మాణం ఎందుకు అడ్డుకోలేదన్నారు. ఈ స్థలాన్ని జిరాయితీ భూమిగా విఆర్ఓ మార్చారన్నారు. ఇలాంటి స్థలాలు కు రికార్డులు రాసే అలవాటు విఆర్ఓ ఆనందరావుకు ఉందన్నారు. గతంలో గడ్డి ముడిదాం గ్రామంలో ఈ విఆర్ఓ రికార్డ్ లు మార్చారన్నారు. ప్రభుత్వం స్థలం ఎక్కడ ఉన్న పసిగట్టి దొంగ రికార్డ్ లు తయారు చెయ్యడం అయనకు అలవాటు అన్నారు. ఇలాంటి అక్రమాలకు ఈ విఆర్ఓ నిత్యం పాల్పడుతున్నారని అన్నారు. ఇతనిపై శాఖ పరమైన ధర్యాప్తు పూర్తి స్థాయిలో చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ విఆర్ఓ ను సస్పెండ్ తో సరిపెట్టవద్దని, డిస్మిస్ చెయ్యాలన్నారు. ఈ విషయం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సంధర్బంగా పార్టీ కార్యకర్తలు నమ్మి దుర్గారావు, అప్పలనాయుడు, గవరయ్య, వావిలపల్లి కిరణ్ పలువురు పాల్గొన్నారు.