గుడ్ మార్నింగ్ సీఎం సార్ కాంపెయిన్ లో తాడికొండ జనసేన

*గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ కాంపెయిన్ లో తాడికొండ మండల జనసైనికులు వీరమహిళలు చురుకుగా పాల్గొన్నారు : గులకవరపు నరేష్

#good morning CM sir జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు.. రోడ్ల దుస్థితి పైనా గాఢ నిద్రలో వున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి చేపట్టిన డిజిటల్ కాంపెయిన్ లో భాగంగా శుక్రవారం ఉదయం తాడికొండ మండలం కంతేరు గ్రామంలో డిజిటల్ కాంపెయిన్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడికొండ మండల నాయకులు గులకవరపు నరేష్, అల్లం రమేష్, సుంకర దుర్గ దేవి ఇతర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.