జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు: రోడ్లు బాగుచెయ్యండి అంటూ 𝟑వరోజు ఆదివారం #𝐆𝐨𝐨𝐝𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠𝐂𝐌𝐒𝐢𝐫 డిజిటల్ క్యాంపెయినింగ్ లొ భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో మండలంలోని డిసిపల్లి, పేగళ్లపాడు గ్రామంలో గుంతలుగా ఉన్న రోడ్డులో జనసేన నాయకులు నిలబడి #𝐆𝐨𝐨𝐝𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠𝐂𝐌𝐒𝐢𝐫 అనే ఫ్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజవర్గ ఉప ఇంచార్జ్ డబ్బుకొట్టు నాగరాజ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, హజరత్, సునీల్ రెడ్డి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.