రోడ్లను బాగుచేయించండి – ప్రమాదాలను అరికట్టండి

  • ధరలను నియంత్రించి అభివృద్ధికి బాట వేయండి
  • ప్రభుత్వానికి బొటుకు రమేష్ బాబు డిమాండ్

దర్శి, జనసేన పార్టీ రోడ్ల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం జనసేన పార్టీ కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య ఆధ్వర్యంలో ఆవులమంద నుండి నాయుడుపాలెం వరకు వున్న రోడ్డు దుస్థితిని దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు, జనసైనికులు మరియు ప్రజలు పాల్గొని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బొటుకు రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూనే వున్నదని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నదని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తూనే వున్నదని తెలిపారు. ఉద్దాన కిడ్నీ బాధితుల సమస్య దగ్గర నుండి, భవన నిర్మాణ కార్మికుల సమస్య నుండి, అమరావతి రాజధాని రైతుల అగచాట్ల దగ్గర నుండి, మహిళా హక్కులు కాపాడడం దగ్గర నుండి, విద్యార్థుల సమస్యల దగ్గరనుండి, ఉద్యోగుల సిపిఎఫ్ సమస్య దగ్గర నుండి, ఆత్మహత్య చేసుకున్నకౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే దగ్గరనుండి, నేటి రోడ్ల దుస్థితివరకు ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ప్రభుత్వ స్పందన కరువైందని అన్నారు. అధికారం లేకపోయినా, అక్రమార్జన లేకపోయినా, తమ కష్టార్జితంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ – వారి స్ఫూర్తితో జనసైనికులు ప్రజలకు అండగా నిలబడుతున్నారని, భవన నిర్మాణ కార్మికుల ఆకలి తీర్చడం కోసం నాడు స్వర్గీయ డొక్కసీతమ్మ పేరిట అన్నదాన కార్యక్రమం చేశారని, నేడు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయంతో ఆసరాగా ఉంటున్నారని, అధికార యంత్రాంగం, ప్రభుత్వ సంపద వున్నా ఈ ప్రభుత్వము ఏమీ చేయలేకపోతున్నదని, అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలకు ఎవ్వరూ వ్యతిరేకంకాదని, కానీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకె కాక అభివృద్ధికి కూడా పెద్ద పీట వేయాలని, రెండింటిని బాలన్స్ చేసుకుంటూ పరిపాలన చేయాలనీ అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల అకౌంట్ లో బటన్ ద్వారా డబ్బు వేస్తున్నామని చెప్పడం బాధ్యతారాహిత్యమని, ప్రజలకు పని కల్పించడం ద్వారా వారిలో ఉన్న సామర్ద్యాన్ని వెలుగులోనికి తీసుకు రావాల్సిన అవసరముందన్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగం చేయవచ్చునన్నారు. చక్కటి రహదార్లు ద్వారా పెట్రోల్ ఆదా చేయవచ్చని, పెట్రోల్ ధరలను నియంత్రించవచ్చని, తద్వారా అన్ని రకాల వస్తువులు మరియు సేవల ధరలను తగ్గించవచ్చని, ప్రమాదాలు కూడా నివారించవచ్చని, కనుక ప్రభుత్వం ఇకనైనా ఈ విషయాలపై మేల్కొని, రోడ్లను బాగుచేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, దర్శి నగర పంచాయితి అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, దొనకొండ మండల కమిటీ అధ్యక్షులుగుండాల నాగేంద్ర ప్రసాద్, దర్శి మండల కమిటీ ప్రధాన కార్యదర్శి మారాబత్తుని వెంకటయ్య, కురిచేడు మండల కమిటీ ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకట్రావు, దొనకొండ మండలకమిటీ ప్రధాన కార్యదర్శి మీనిగ నాగూర్ బాబులతో బాటు నియోజకవర్గ ఐటి కోర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పుప్పాల రుద్రా, జనసైనికులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.