సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటించిన ప్రభాస్

గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వర్ష బీభత్సంతో హైదరాబాద్ నగరం తల్లిడిల్లిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తూ బాసటగా నిలుస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహాయనిధికి తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

ఇప్పటికే వరద బాధితులను ఆదుకోవడానికి నందమూరి బాలకృష్ణ కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా, మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. అటు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్, విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలను ప్రకటించారు.