ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం

ప్రకాశం జిల్లా: కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో గల ఎస్సీ కాలనీ లో పలు సమస్యలు గురించి జనసేన పార్టీ దృష్టికి రాగా జనసేన నాయకులు పాత సింగరాయకొండ ఎస్సీ కాలనీ నీ సందర్శించి కాలనీ ప్రజలతో మాట్లాడి పలు సమస్యలు ఉన్నాయని కాలనీ ప్రజలు తెలియజేశారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో మంచినీటి ఆర్వో ప్లాంట్ రిపేర్ అయి రెండు సంవత్సరాల అయినప్పటికీ కూడా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని కాలనీ ప్రజలు వాపోతున్నారు. అంతేగాక బోరింగ్ లు ఉన్నాయి కానీ ఒకటి కూడా పనిచేయని పరిస్థితి వాటిని మరమ్మతులు నోచుకోని పరిస్థితి కూడా నెలకొన్నది అని ఎస్సీ కాలనీ ప్రజలు తెలిపారు. అంతేగాక డ్రైనేజీ లేక ఇంటిముందు మురికి నీరు నిలువ ఉండి దోమలు క్రిమి కీటకాలు ఎక్కువగా నీటిలో నివసించి దళిత కాలనీ ప్రజలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కాలనీ ప్రజలు తెలియజేశారు. ఎస్సీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ కి వినతి పత్రం అందజేయడానికి పోగా ఆయన లేనందువలన ఏ ఈ కిషోర్ కి జనసేన నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగినది. పాత సింగరాయకొండ ఎస్సీ కాలనీ ప్రజల సమస్యల విషయంపై పాత సింగరాయకొండ పంచాయితీ కార్యదర్శి కి కూడా వినతి పత్రం అందజేయడానికి వెళ్ళగా కార్యదర్శి కుర్చీ కాళిగా కనిపించడం ఆశ్చర్యదాయకంగా కనిపించింది. అనంతరం సచివాల సిబ్బంది అయినటువంటి కంప్యూటర్ ఆపరేటర్కు వినతిపత్రం అందజేసి పంచాయతీ సెక్రెటరీ కి తెలియజేయమని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, మండల నాయకులు కాసుల శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, సంకే నాగరాజు, సయ్యద్ చాన్ భాషా, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా బాషా, నామ వెంకటేష్, పొనుగోటి అశోక్, షేక్ సుభాని, చలంచర్ల కరుణ్ కుమార్, తగరం రాజు, పాలకుర్తి శ్రీనాథ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.