జనసేన ఆధ్వర్యంలో ప్రజా పోరాట యాత్ర

పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండల నాయకులు, పుల్లగుమ్మి పరమేష్, ఆగిపోగు నాగరాజు, నాయకల్ బాబ్జి, బడల్లా ఆదెన్న, ఆధ్వర్యంలో, బుక్కాపురం, కలగొట్ల, కృష్ణాపురం, గ్రామాలలో ప్రజా పోరాట యాత్ర కొనసాగించడం జరిగింది.. ఈ సందర్భంగా
జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సి జి రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన ప్రజా పోరాట యాత్ర ద్వారా, సోమవారం బుక్కాపురం, కలగొట్ల, కృష్ణాపురం, గ్రామాలలో అనేక సమస్యలు కల్లారా చూసాం, ప్రజలు చెప్తుంటే విన్నాం.. ముఖ్యంగా గ్రామాలలో ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి, వచ్చిన తర్వాత గ్రామాలలో త్రాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉందని, గ్రామస్తులు చెబుతున్న ఆవేదన బాధ మాకు అర్థమైంది, కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఎందుకు అర్థం కావడం లేదు, బుక్కపురం మరియు కలగొట్ల గ్రామాలలో త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు చూసాం ఈ రెండు గ్రామాల్లో గ్రామానికి మొత్తానికి ఒకటే ట్యాంక్ ఉంది, అక్కడికే వచ్చి నీరు తీసుకెళ్లాలి, ఈ గ్రామాలలో ఎలక్షన్ టైములో ఓట్లు వేయించుకునే టైంలో మాత్రం ఇంటింటి నీటి కుళాయిలు వేయిస్తామని చెప్పి హామీ ఇస్తారు కానీ గెలిచిన తర్వాత మా సమస్యలు ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు తెలియజేసిన తీరు చాలా బాధాకరం, వయసు పైబడిన వారు ముసలివారు నీరు తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేను కళ్లారా చూసా, ఇప్పటికైనా ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ గ్రామస్తులు సమస్యలు తీర్చాలని జనసేన పార్టీ తరఫున కోరుచున్నాం వైఎస్ఆర్సిపి నాయకులకు మాట ఇవ్వడం మాట తప్పడం అలవాటైపోయింది, ఇప్పటికైనా ఉచిత పథకాల వల్ల ఏమి లాభం లేదు, జరగాల్సింది గ్రామాల్లో అభివృద్ధి, గ్రామాల్లో ఉన్న ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలి, ఈ గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నాయి, వీటి పైన దృష్టి పెడితే బాగుంటుంది, ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం మీకు రంగుల పై ఉన్న శ్రద్ధ , ప్రజా సమస్యలపై ఎందుకు లేదు, మాట తప్పని మడమ తిప్పనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, ప్రజా సమస్యలు మీకు కనిపించడం లేదా, గొప్పలు చెప్పుకోవడం కాదు, గ్రామాలను గొప్పగా అభివృద్ధి చేయండి అని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు కాల్వ భాస్కర్, గద్దల రాజు, చాకలి నాగేశ్వరరావు, ఈడిగ చిరంజీవి, నరసింహుడు, ఆది, వెంకటేష్, మరియు తదితరులు ప్రజా పోరాట యాత్రలో పాల్గొన్నారు.