సిసి రోడ్లు ఏర్పాటు చేయాలంటూ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత

  • వినతి పత్రం అందజేసిన జనసేన రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య

సిద్ధవటం: మండల పరిధిలోని మాధవరం1 గ్రామపంచాయతీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని దీంతో ప్రజలు పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి, రాటాల రామయ్య ఎంపీడీవో ప్రతాప్ కు వినతిపత్రంఅందజేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర వికాస కార్యదర్శి, రాటాలరామయ్య మాట్లాడుతూ.. ఈగ్రామంలో నివాసముంటున్న ప్రజలు సోమశిల ముంపు గ్రామాల నుండి ఇక్కడికి రావడం జరిగిందని ఇక్కడ సొంతం నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారని గత 30 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని వాటికి ఏరోజు శాశ్వత పరిష్కారం చేపట్టలేదని ఆయన అన్నారు. వర్షం వచ్చిందంటే రోడ్లుచెరువును తలపించే విధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు,ఉప్పల రామకృష్ణ, చొప్పా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.