పెనుబాల శ్రీనివాసులు ను పరమర్శించిన రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాయచోటి మాజీ ఎంపీ, ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు అత్యంత సన్నిహితులు, సీనియర్ రాజకీయ నేత, బలిజ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు మరియు మండల రైతు సంగం అధ్యక్షులు పెనుబాల శ్రీనివాసులు ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై రాయచోటి అమరావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని డిస్చార్జ్ కాగా.. విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ రామశ్రీనివాస్ శ్రీనివాసులు ను స్వగ్రామం రాజంపేట నియోజకవర్గం, టి. సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామపంచాయతీ వడ్లపల్లి స్వగృహం నందు ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా… పలు సామాజిక వర్గ నేతలు రామంజులు, వెంకటరమణ, డా. భాస్కర్, సుంకర మదన్ కుమార్ తదితరులు రామ శ్రీనివాస్ వెంట ఉన్నారు.