బాధితుల పక్షాన మాట్లాడితే దాడులా..??: గుమ్మడిసాని శిల్ప

  • జనసేన పార్టీ నాయకురాలు గుమ్మడిసాని శిల్ప..

నార్పల: జనసేనపార్టీ మహిళా నాయకురాల్లను దుర్భాషాలాడిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెంటనే క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ నాయకులు గుమ్మడిసాని శిల్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని, వైకాపా ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా రాజ్యాంగ నిబంధనలు, ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కుతూ తాము చెప్పిందే శాసనం అంటూ నియంత ధోరణి ఆవలంభిస్తున్నదని ఆరోపించారు. గోదావరి తీర ప్రాంతాల్లో ముంపుకు గురైన బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 10 వేల రూపాయలు అందించేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన జనసేనపార్టీ వీరమహిళా నాయకురాల్లపై మహిళలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎమ్మెల్యే రాజా పరుష పదజాలంతో దుర్భాషలాడుతూ.. మీ అంతు చూస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని. మహిళలకు ఎమ్మెల్యే రాజా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలంతా కలసి నీకు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.