జనసేన ఆధ్వర్యంలో శ్రమదానం

తణుకు: జువ్వలపాలెం నుంచి పడాల వరకు పాడైన రోడ్లగోతులు పూడ్చే శ్రమదానం కార్యక్రమం.. పాలూరి బలుసులురావు (బూరయ్య) ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రావ్యవస్ధలో ఉండడం వల్ల ప్రజలు గోతులలో పడి ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుందని బుధవారం అత్తిలికి సంబంధించిన యువకుడు గోతులో పడి ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా భాదని కలిగించిందని ఆయన అన్నారు. గురువారం, శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గోతులు పూడ్చే కార్యక్రమం చేపడుతుందని చెప్పారు. ఈ ప్రభుత్వం జులై 15 వ తేదీలోగా రాష్ట్రంలో రోడ్లు అన్ని బాగుచేస్తామని చెప్పి మొద్దు నిద్రపోతుందని చెప్పారు. తాడేపల్లిగూడెంలో స్వచ్చంద సంస్థలు రోడ్లు వేసే స్థితికి ఈ ప్రభుత్వ పరిపాలన ఉందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అడబాల నారాయణ మూర్తి, వర్తనపల్లి కాశీ, కసిరెడ్డి మధులత, యంట్రపాటి రాజు, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, గుండెమోగుల సురేష్, మద్దాల మణి కుమార్, కొనకళ్ల హారనాథ్, మైలవరపు రాజేంద్రప్రసాద్, సోమా శంకర్ యాదవ్, పెనుబోతుల సోమలమ్మ, నీలపాల దినేష్, చాపల రమేష్, అడబాల మురళి, గట్టిం నాని, మదాసు ఇందు, పాలూరి సందీప్, పెనుబోతుల బాలాజీ, రాయపురెడ్డి మారుతి, బొరుసు ప్రభు, ములగాల శివ, ద్వారాబందం సురేష్, బయనపాలేపు ముకేశ్, నంద్యాల సిద్దు, యవర్న సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు.