MI Vs CSK: బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా ఐపీఎల్ లో మరో రసవత్తరమైన పోరు జరగనుంది. ఐపీఎల్ లో చిరకాల ప్రత్యర్థులుగా చెప్పుకునే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో పొలార్డ్ సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు. ఇక ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే..చెన్నై మూడు మార్పులతో దిగింది. ఈ మ్యాచ్ చెన్నైకు చాలా కీలకం కానుంది.