కబ్జాలపై వార్తలు రాస్తే దాడులు చేస్తారా..?: రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాయచోటి: జనసేన పార్టీ నేత రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కబ్జాలపై వార్తలు రాస్తే పాత్రికేయులపై దాడులు చేయడం నీతిమాలిన చర్య అని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కోరుతూ… మదనపల్లె కు చెందిన ఆంధ్రప్రభ విలేకరి వెంకట శివ పై అధికార పార్టీకి చెందిన వెంకటేశ్వర రెడ్డి, భాస్కర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు చేస్తున్న భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. అక్రమాలు చేయడమే కాకుండా అక్రమాలపై వార్తలు రాస్తే దాడులు చేస్తారా అని తీవ్రంగా ఖండించారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కదా అని అక్రమాలు, భూదందాలు, అరాచకాలు చేస్తూ ఉంటే పాత్రికేయులు చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. అలానే జనసేన పార్టీని రాష్ట్ర ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో ఆదరించాలని ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి చాలామందికి అవకాశం ఇచ్చారు. ఈ సారి యేమి ఆశించని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచన చేయండి ఆయన నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా సమాజ సేవ దృక్పథం ఉన్న వారు ప్రజా సేవకులు జనసేన వైపు చూడాలని పిలుపునిచ్చారు… ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామశ్రీనివాస్, షైక్ రియాజ్ పాల్గొన్నారు.