క్రేన్ ప్రమాద భాదిత కుటుంబాలను ఆదుకోవాలి!: జనసేన డిమాండ్

నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎల్లూర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని శుక్రవారం ఉదయం జరిగిన క్రేన్ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందడం బాధాకరం.

ఇందులో భాగంగా శనివారం ఉదయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి..తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు రామ్ తాల్లూరి పిలుపు మేరకు.

ఈ రోజు ఉదయం 8గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఐదుగురు కార్మికులు మరణించిన ప్రమాదానికి గల కారణాలను తెలుకోవడానికి, వారికి తగిన నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. ఘటన స్థలాన్ని రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబెర్ ఎం.డి మహబూబ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు
బైరపోగు సాంబశివుడు, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు ముకుంద నాయుడు పరిశీలించారు. ఇందులో భాగంగా లక్ష్మణ్ గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు.. క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు కుటుంబాలకు నష్టపరిహారం త్వరగా అందించి.. వారి కుటుంబాలకు అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్న యువకులతో పని చేయించుకుంటున్నారు.. యువకులకు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి పనికి రాకపోతే వారిని కష్టం చేసిన డబ్బులు ఇవ్వం.. అన్నం పెట్టం.. ఉంటే ఉండండి లేదంటే పొండి అని ఇలాంటి అహంకారపు మాటలు, యువకులను బెదిరింపులకు గురి చేస్తూ ఇన్నాళ్లు వారితో పనులు చేయించుకున్నారు. ఇప్పటికి ఏ ఒక్కరికి కూడా 2నెలల జీతం ఇవ్వలేదని యువకులు అంటున్నారు. ఈ యొక్క ప్రాజెక్టు యాజమాన్యానికి ఇది సబపు కాదు.. దీన్ని ఇకనైన మానుకోవాలి అని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సాంబశివుడు మాట్లాడుతూ.. మృతి చెందిన ఐదుగురు కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే అన్ని విధాలుగా ఆదుకోవాలి.. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ప్రాజెక్టు వర్క్ కోసం యువకులను బెదిరింపులకు గురిచేయడం సరైన పద్ధతి కాదు దీన్ని వెంటనే అధికారులు ప్రాజెక్టు యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు గోపాస్ కురుమన్న జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ కార్యవర్గ నిర్వాహక సభ్యులు భారిగారి రాజేందర్, సూర్య, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జానీ, రేచర్ల శేఖర్, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు కోడిగంటి సాయి, పెరుమల్ల శేఖర్, కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు పులోజు రఘు, మల్లేష్, సుల్తాన్, అంజి, రఘు తదితరులు పాల్గొన్నారు.