ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 18వ రోజు పాదయాత్ర

ఏలూరు నియోజకవర్గం 14వ డివిజన్ లోని గణేష్ కాలనీ, పుప్పాల సూర్య నారాయణ కాలనీ, సాయి నగర్ కాలనీ, శివ నగర్ కాలనీలో ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ డివిజన్ లో డ్రైనేజీ వ్యవస్థ లేదు.. మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. మౌళిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆళ్ళనాని కానీ అధికార పార్టీ నాయకులు కానీ మేయర్ కానీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటని అన్నారు. వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడంలోను విఫలమయ్యారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పూర్తి అసంతృప్తి ఇస్తుందని రెడ్డి అప్పల నాయుడు ఎద్దేవా చేశారు. వాలంటరీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆనాడు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత ఈరోజు వరకు ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.. అలాగే నిరుద్యోగులకు, చదువుకున్న చదువుకు సరైన పని దొరక్క ఉపాధి లేక ఆంధ్ర రాష్ట్రం దాటి పరాయి రాష్టైనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలూరు నియోజకవర్గం లో సరైన పరిశ్రమలు లేదు.. ఉన్న ఒకే ఒక జ్యూట్ మిల్లును మూతపడేలా చేసి 4 వేల కుటుంబాలు రోడ్డున పడేలాగా చేశారని రెడ్డి అప్పల నాయుడు మండిపడ్డారు. పనికి ఆహార పథకం వంటి ప్రభుత్వ పధకాలకు గ్రామాలు విలీనం అవడం వలన ఉపాధి కోల్పోయిన కూలీలు. అలాగే పాత బకాయిలు చెల్లించాలని రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. ఈ అంశంపై రేపు ఉదయం 11 గంటలకు ఏలూరు కలెక్టర్ ని కలిసి రిప్రజెంటేషన్ (వినతి పత్రం) ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, అధికార ప్రతినిధి కూనిశెట్టి మురళి, అల్లు సాయి చరణ్, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు బోండా రాము నాయుడు, పసుపులేటి దినేష్, తేజ ప్రవీణ్, స్థానిక నాయకులు టవిటి రాజు, దిండి కోటి, దిండి రమేష్, కోటి, దిండి దుర్గారావు, నక్కిన కృష్ణ,బాడంగి రామారావు, గణేష్, బేపాల రమేష్, శ్రీను, సాయి, రాము, వెంకట్రావు, ఎమ్.రాజు, ధన కోటి, తూటిక భద్రరావు, తూటిక సన్యాసిరావు, మిర్తి పాటి కిరణ్, మిర్తి పాటి మావుళ్ళు, తాతారావు, సున్నపు సుధాకర్, మెట్టు పైడిరాజు, ఉప్పాడ శ్రీను, నల్ల గణేష్, దువ్వి రాములప్పడు, అల్లాడ వినోద్ కుమార్, గొట్టాపు ప్రభాకర్, అప్పల కొనికి రాజశేఖర్, సత్తిబాబు, మల్లా యేసు, కింజరాపు చందూ, నల్ల లోవరాజు మరియు వీర మహిళలు సరళ, సుజాత తదితరులు పాల్గొన్నారు.