గంగవరం జనసేన జనబాటకు కార్యాచరణ సిద్ధం

పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండల అధ్యక్షురాలు శ్రీమతి మంజుల ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే జనసేన పార్టీ గంగవరం మండలం జనబాటకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో గడప గడపకు వెళ్తూ పార్టీ సిద్దాంతాలను ప్రజలకు తెలిజేస్తూ గ్రామంలో సమస్యలు గుర్తించి.. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి పల్లెలో నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.